15 July, 2026 | 12:20 AM

టీటీఏ నూతన డైరెక్టర్‌గా ప్రొ.భట్టు రమేష్

15-07-2026 12:19 AM

హైదరాబాద్, జూలై 14 (విజయక్రాంతి): తెలంగాణ తెలుగు అకాడమీ (టీటీఏ) నూతన డైరెక్టర్‌గా సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్ట్రార్, సీనియర్ అధ్యాపకులు ఆచార్య భట్టు రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఇప్పటి వరకు ఈ స్థానంలో అదనపు బాధ్యతలు నిర్వర్తించిన సాంకేతిక విద్యా కమిషనర్ శ్రీదేవసేనను రిలీవ్ చేశారు.