calender_icon.png 14 February, 2026 | 7:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చరిత్రకు చిహ్నంగా శివకేశవాలయం

14-02-2026 05:23:26 PM

వాంకిడి,(విజయక్రాంతి): వాంకిడి మండల కేంద్రంలోని చిక్లినది తీరాన కాకతీయుల కాలంలో నిర్మితమైన శివకేశవాలయం చరిత్రకు చిహ్నంగా నిలుస్తోంది. ఈ ఆలయం కాకతీయుల విజయాలకు ప్రతీకగా నిర్మించబడిందని స్థానిక ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ఆలయంలో శివకేశవులతో పాటు రేణుక మాత విగ్రహాలు కొలువుదీరడం విశేషమని స్థానికులు పేర్కొన్నారు.

ఒకే చోట శివుడు, కేశవుడు కొలువుదీరడం అరుదైన విషయమని వారు తెలిపారు. ఆలయ నిర్మాణ శైలి పరిశీలిస్తే ఆనాటి శిల్పకళా వైభవం స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు.ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో, చిక్లినది తీరాన జాతరతో పాటు రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.