15 July, 2026 | 12:17 AM

ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ ఫారం నింపాలి

15-07-2026 12:17 AM

మాగంటి సునీత

జూబ్లీహిల్స్, జూలై 14 (విజయక్రాంతి): ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా అర్హులైన ప్రతి ఓటరు ఎన్యుమరేషన్ ఫారం తప్పకుండా నింపాలని బీఆర్‌ఎస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇంచార్జి మాగంటి సునీత గోపీనాథ్ కోరారు. బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు హరిందర్ సింగ్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఎస్‌ఐఆర్ అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఏజీ కాలనీ డివిజనులో ఇంటింటికి వెళ్తూ ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారంలు నింపడంపై అవగాహన కల్పించారు.