సుప్మా అధ్యక్షుడిగా జగన్ గౌడ్
సుల్తానాబాద్ మార్చి 22 (విజయక్రాంతి): శాతవాహన యూనివర్సిటీ ప్రైవేటు డిగ్రీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ సూప్మా నూతన అధ్యక్షు డిగా రాజన్న జిల్లాకు చెందిన గుగ్గిళ్ళ జగన్ గౌడ్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు, ఆదివారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని విజయ ఫంక్షన్ హాల్ లో జరిగిన సూప్మా జనరల్ బాడీ సమావేశంలో ఈ ఎన్నికలను నిర్వహించారు.
ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్ కు చెందిన గోవిందవరం కృష్ణ, కోశాధికారిగా ధర్మపురి కి చెందిన సంగోజు అంజయ్య ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉమ్మడి జిల్లాలో శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఎదుర్కొంటున్న పలు రకాల సమస్యలపై చిత్తశుద్ధితో పోరాడి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని నూతన కార్యవర్గం స్పష్టం చేసింది,
ఈ సందర్భంగా సూప్మా పూర్వ ప్రతినిధులు వెంకటేశ్వరరావు శ్రీపాద నరేష్ కొలనూరు శేఖర్ రెడ్డి నూతన ప్రతినిధులను సత్కరించారు, సమావేశంలో వివిధ కళాశాల నిర్వాహకులు ఊట్కూరి రవీందర్ రెడ్డి, డిగ్రీ కాలేజీల నిర్వాహకుల సంఘం రాష్ట్ర కార్యదర్శి యాద రామకృష్ణ, సుప్మా పూర్వ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు నాలుగు జిల్లాల డిగ్రీ కాలేజీల నిర్వాహకులు సిబ్బంది పాల్గొన్నారు.




