15 July, 2026 | 1:22 AM

రాజమౌళి స్టాంప్ పడ్డ స్క్రిప్ట్ ఇది

15-07-2026 01:21 AM

ఫహాద్ ఫాజిల్ హీరోగా ఎస్‌ఎస్ రాజమౌళి సమర్పణలో ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్‌ఎస్ కార్తికేయ నిర్మించిన చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. శశాంక్ యేలేటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీని సెప్టెంబర్ 11న రిలీజ్ చేయబోతోన్నారు.

ఈ నేపథ్యంలో ఈ మూవీ టీజర్ లాంచ్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వుహించారు. ఈ కార్యక్రమంలో ఫహాద్ ఫాజిల్ ఆడియో బైట్ ద్వారా మాట్లాడారు. దర్శకుడు శశాంక్ యేలేటి మాట్లాడుతూ.. “ఈ కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది. ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసేలా మా సినిమా ఉంటుంది” అన్నారు.

నిర్మాత ఎస్‌ఎస్ కార్తికేయ మాట్లాడుతూ.. “డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ మనసుకు హత్తుకునే చిత్రం. ఈ మధ్య కాలంలో ఇలాంటి జానర్‌లో సినిమా రాలేదు. ఈ చిత్రంలో చాలా వీఎఫ్‌ఎక్స్ వర్క్ ఉంది. రాజమౌళి స్టాంప్ పడ్డ తర్వాతే స్క్రిప్ట్ లాక్ అయింది. మూవీ అంతా పూర్తయ్యాక మళ్లీ ఆయనకు చూపించి సలహాలు తీసుకుంటాం” అన్నారు. ‘అందరూ చూసి ఎంజాయ్ చేసేలా మా చిత్రం ఉంటుంది. దక్షిణాది భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నాం’ అని నిర్మాత శోభు యార్లగడ్డ తెలిపారు. సంగీత దర్శకుడు కాలభైరవ, చైల్డ్ ఆర్టిస్ట్ సారా కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడారు.