ఆ సంస్థతో ఎన్టీఆర్‌కు సంబంధం లేదు
ఎన్టీఆర్ పేరుతో ప్రకటనలు చేస్తూ, కార్యక్రమాలు నిర్వహిస్తున్న RAW NTR సంస్థకు ఎలాంటి అధికారం లేదని నటుడు ఎన్టీఆర్ కార్యాలయం స్పష్టం చేసింది. ఆయనకు సంబంధించిన సేవా, ప్రజా సంక్షేమ కార్యక్ర మాలు వివరాలు ఆయన అధికారిక బృందం ద్వారా వెల్లడి అవుతాయని ప్రకటించింది.
ఈ మేరకు ఎన్టీఆర్ ఆఫీస్ ఒక ప్రెస్‌నోట్‌ను విడుద చేసింది. “RAW NTR పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఒక సంస్థ, ఎన్టీఆర్‌తో సంబంధం ఉన్నట్టుగా ప్రజల్లో భావన కలిగించేలా వ్యవహరిస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. ఎన్టీఆర్‌కు గానీ, ఆయన కార్యాలయానికి గానీ RAW NTR అనే సంస్థతో ఎలాంటి సంబంధం లేదు.
ఆ సంస్థకు ఎన్టీఆర్ తరఫున ప్రాతినిధ్యం వహించే హక్కు లేదు. ఎన్టీఆర్‌కు సంబంధించిన ఏదై నా సేవా కార్యక్రమం, ప్రజా సంక్షేమ కార్యక్రమం, అధికారిక ప్రకటన లేదా ఇతర కార్యకలాపాల గురించి సమాచారం ఎన్టీఆర్, లేదా ఆయన అధికారిక బృందం ద్వారా మాత్రమే వెల్లడించబడుతుంది. ఈ అంశంపై ఇదే మా తరఫున తుది వివరణ” అని ప్రకటనలో పేర్కొన్నారు.






