22 May, 2026 | 3:59 AM

ఐక్యతనే అభివృద్ధి దిశగా తీసుకుపోతుంది

22-05-2026 02:00 AM

మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి 

మహబూబ్ నగర్ అర్బన్, మే 21: ఐక్యతతోనే అభివృద్ధి జరుగుతుంది మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. గురువారం నగరంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే నెల 21వ తేదీన ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ సమావేశానికి భారీ ఎత్తున ఉద్యమకారులు హాజరుకావాలని మంత్రులు ఈ సమావేశానికి హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు గడ్డమీది గోపాల కృష్ణ, రాష్ట్ర నాయకులు రహీం, బోరెల్లి సురేష్, మీ సాల మహేష్, అన్వార్ పాషా, జక్కా గోపాల్, నాచశ్రీనివాస్ ఎయిర్టెల్ కృష్ణ. కొమ్ము జగన్, కృష్ణ, శ్రీనివాసు, పోలె నరేందర్, విజయ్ కుమార్, అంజి తదితరులు పాల్గొన్నారు.