22 May, 2026 | 4:39 AM

నార్కోటిక్ డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు

22-05-2026 01:08 AM

మంచిర్యాల, మే 21 (విజయక్రాంతి): గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణ లక్ష్యంగా మంచిర్యాల జిల్లాలోని సీసీసి నస్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఎస్త్స్ర ప్రశాంత్ ఆధ్వర్యంలో నార్కోటిక్ డాగ్ స్క్వాడ్, యాంటీ నార్కోటిక్స్ వింగ్ మంచిర్యాల, సీసీసీ నస్పూర్ పోలీసుల సమన్వయంతో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా ఆటో స్టాండ్ వద్ద ఉన్న వ్యక్తులు, ప్రయాణికుల సామాన్లు, హోటళ్ల పరిసరాలు, పాన్ షాపులు, అనుమానాస్పద ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం, నిల్వలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్త్స్ర తెలిపారు. ఈ తనిఖీలు సీసీసీ నస్పూర్ కార్నర్ ప్రాంతం, ఆటో స్టాండ్ పరిసరాలు, సమీప హోటళ్లు, పాన్ షాపులు, ప్రజలు అధికంగా రాకపోకలు సాగించే ప్రాంతాల్లో చేపట్టారు. ప్రజలకు గంజాయి, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తూ, అనుమానా స్పద వ్యక్తులు లేదా కార్యకలాపాల గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. యువత మత్తు పదా ర్థాలకు దూరంగా ఉండాలని, సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల సహకారం అవసరమని ఎస్త్స్ర పేర్కొన్నారు.