22 May, 2026 | 3:40 AM

మజ్దూర్ యూనియన్ పోస్టర్స్ ఆవిష్కరణ

22-05-2026 01:09 AM

మహబూబాబాద్, మే 21 (విజయక్రాంతి): రైల్వే మజ్దూర్ యూనియన్ వరంగల్ బ్రాంచ్ సెక్రెటరీ యుగంధర్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ నెల 26 న సికింద్రాబాద్ రైల్ కళారంగ్ లో నిర్వహించనున్న మజ్దూర్ యూనియన్ 58 వ వార్షికోత్సవ మహాసభల వాల్ పోస్టర్ ను మహబూబాబాద్ సీనియర్ సెక్షన్ ఇంజినీర్ కార్యాలయం వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మజ్దూర్ యూనియన్ అసిస్టెంట్ సెక్రెటరీ బాబురావు, వైస్ చైర్మన్ భాస్కర్ రావు, యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ వంశీ, యూత్ లీడర్స్ రాజు యాదవ్, రాజు నాయక్, కొలిపాక రాజు, మోహన్ నాయక్, సతీష్, నవీన్, రాజు, వెంకట్ రత్నం, మురళీ, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.