14 May, 2026 | 3:11 AM

నేడే కేరళ సీఎం పేరు ప్రకటన

14-05-2026 02:04 AM
  1. ఢిల్లీలో రాహుల్ వరుస సమావేశాలు
  2. ఖర్గే, సోనియా తుది నిర్ణయమే ఫైనల్

తిరువనంతపురం, మే 13: కేరళ ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠతకు నేడే తెరపడ నుంది. అసెంబ్లీ ఎన్నికల తరువాత పది రో జులుగా సీఎం పీఠంపై సందిగ్ధత నెలకొంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళ, బుధవారాల్లో ఢిల్లీలో కేరళకు చెందిన మాజీ పీసీసీ అధ్యక్షులతో వరుస సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలను తీసుకున్నారు. రాష్ట్ర, క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఆరా తీ శారు. రాత్రి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసానికి వెళ్లిన రాహుల్ సుమారు 40 నిమిషాలపాటు సమావేశమయ్యా రు.

అంతకుముందు సీనియ ర్ నేత కె. మురళీధరన్ మాట్లాడుతూ.. సోనియాగాంధీతో చర్చించి ఎంపికపై తుది నిర్ణ యం తీసుకొని ప్రకటించే అవకాశం ఉందన్నారు. సీఎం పదవికి రమేష్ చెన్నితల, వీడీ సతీశన్, కేసీ వేణుగోపాల్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మాజీ పీసీసీ అధ్యక్షులతో నిర్వహిం చిన సమావేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు సమాచారం. యూడీఎఫ్‌లో కీలకమైన ముస్లింలీగ్ అభిప్రాయం కూడా పరిగణనలోకి తీసుకోవాలని వారు సూచించారు.

మరోవైపు కేసీ వేణుగోపాల్ సీఎంగా వద్దని వయోనాడ్‌లోని కాంగ్రెస్ కార్యాలయం ఎదుట పోస్టర్లు వెలిశాయి. సీఎం ఎంపికపై మూడువర్గాలు త మ అభిమాన నేతనే ఎన్నుకోవాలని డిమాండ్ చేస్తున్నా యి. సీఎం ఎంపికలో జా ప్యంపై బీజేపీ, ఎల్డీఎఫ్‌లు కాంగ్రెస్‌పై విమర్శలు సంధిస్తు న్నాయి. ఓటర్ల నుంచి తీర్పు వచ్చినా నాయకత్వంలో ఏకాభిప్రాయం సాధించక పోవ డం శోచనీయమని విమర్శించాయి.