30 July, 2026 | 2:49 AM

మెడికో పేరెంట్స్ అసోసియేషన్ ఆవిర్భావ వేడుకలు

30-07-2026 12:56 AM

నీట్, ఎంబీబీఎస్ విద్యార్థులకు అన్ని విధాలా అండగా ఉంటాం: రాష్ట్ర అధ్యక్షుడు మల్లోజు సత్యనారాయణ చారి

నాగోల్, జూలై 29(విజయ క్రాంతి): మెడికో పేరెంట్స్ అసోసియేషన్ తొలి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని నాగోల్ బండ్లగూడలోని పల్లవి ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం అసోసియేషన్ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మల్లోజు సత్యనారాయణ చారి మాట్లాడుతూ, నీట్కు సిద్ధమవుతున్న విద్యార్థులు, నీట్ పరీక్ష రాసిన అభ్యర్థులు, ఎంబీబీఎస్లో చేరిన విద్యార్థులు, వైద్య విద్యార్థులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారంలో మెడికో పేరెంట్స్ అసోసియేషన్ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని తెలిపారు.

విద్యార్థుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, విద్యార్థులు, అసోసియేషన్ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో 400 మంది పేరెంట్స్ పాల్గొన్నారు, అలాగే అసోసియేషన్ బలోపేతానికి విశేషంగా కృషి చేసిన సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ బీరెల్లీ కమలాకర్, ఉపాధ్యక్షులు పానుగుళ్ల సుజాత, పొడిశెట్టి రమేష్, రవికుమార్, గడ్డం స్వప్న, దుంపల సంధ్య, శ్రీనివాస్, దయానంద్, భాస్కర్, యాదగిరి, గునుగుంట్ల శ్రీనివాస్, శ్రీధర్, జైపాల్ తదితరులు పాల్గొన్నారు.