7 May, 2026 | 12:23 AM

ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలతో ప్రజలకు మెరుగైన సేవలు

07-05-2026 12:00 AM

డిప్యూటీ కమిషనర్ డాక్టర్ ఎన్ వాణి

కోదాడ మే 6: ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలతో ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని ఉమ్మడి నల్గొండ జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ ఎన్ వాణి అన్నారు. బుధవారం కోదాడ మండలం పరిధిలోని గుడిబండ లో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కోదాడ యూనిట్ ఆఫీస్ కార్యాలయ భవనాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. అద్దె భవనాల్లో తరచు  కార్యాలయాలను మార్చడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతారని సొంత భవనాల ఏర్పాటుతో ప్రజల సమస్యల పరిష్కారానికి శాశ్వత పరిష్కారం కలుగుతుందన్నారు.

కోదాడ యూనిట్ కార్యాలయంలో ప్రజలకు మెరుగైన సేవలను అందించాలన్నారు. విశాలమైన స్థలంలో ప్రశాంత వాతావరణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యాలయాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కోతి సంపత్ రెడ్డి, ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఎస్ జయప్రకాష్ రెడ్డి, కోదాడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జిలాని షేక్, జి ఆర్ చరణ్, గుడి బండ సర్పంచ్ నాగయ్య పాల్గొన్నారు.