7 May, 2026 | 12:45 AM

తప్పుడు కేసులపై విచారణ జరపండి

07-05-2026 12:00 AM

నందిగామ పోలీసులపై వచ్చిన ఫిర్యాదుపై షాద్ నగర్ డీసీపీకి పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ నోటీసులు 

షాద్ నగర్, మే 6, (విజయక్రాంతి): నందిగామ పోలీసులపై వచ్చిన తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో జిల్లా పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ (హైదరాబాద్ రీజియన్) కీలక ఆదేశాలు జారీ చేసింది. బాధి తులు సమర్పించిన ఆధారాలను పరిశీలించిన అథారిటీ చైర్మన్ కె. సుదర్శన్, సభ్యులు, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి ఈ నెల 15  లోగా నివేదిక సమర్పించాలని షాద్‌నగర్ జోన్ డీసీపీని ఆదేశించారు.

కేసు వివరాల్లోకి వెళితే... రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం రంగాపూర్  గ్రామానికి చెందిన కొంగర మహేష్, యదమ్మ, శేఖర్, వెంకటేష్లు తమపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ మార్చి 23న పోలీస్ కంప్లైంట్స్ అథారిటీని ఆశ్రయించారు. నందిగామ పోలీస్ స్టేషన్లో పనిచే స్తున్న సీఐ పి. ప్రసాద్, ఏఎస్‌ఐ కె. శ్రీనివాస్, ఎస్‌ఐ ఎం. గోపాలకృష్ణలు తమను వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

బాధితు లపై తప్పుడు ఎఫ్‌ఐఆర్ (క్రైమ్ నెం. 112/ 2025) నమోదు చేయడం, ఫిర్యాదు తేదీలను తారుమారు చేయడం, ఫోర్జరీ సంతకాలతో ఛార్జ్ షీట్ దాఖలు చేయడమే గాకుండా బాధితుల నుండి ద్వారా లంచా లు వసూలు చేశారని ఆరోపించారు‘ రాజకీయ ఒత్తిళ్లతో నిందితులకు కొమ్ముకాస్తూ ఆధారాలు సమర్పించినా కేసు నమోదు చేయకుండా కంప్లైంట్ చేసిన తమపైనే తప్పుడు కేసులు పెడుతున్నారని బాధితులు వాపోయారు.

ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన అథారిటీ&క్రైమ్ నెం. 112/ 2025 రిజిస్ట్రేషన్ ఛార్జ్ షీట్ సమర్పించిన పరిస్థితులు&బాధితులు గతంలో ఇచ్చిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలు&లంచం వసూలు, ఫోర్జరీ సంతకాలపై పోలీసుల పాత్ర వంటి అంశాలపై విచారణ జరిపి  నిర్దేశించిన గడువులోగా వాస్తవాలతో కూడిన నివేదికను అందజేయాలని షాద్ నగర్ డీసీపీని అథారిటీ నోటీసులో స్పష్టం చేసింది.