8 March, 2026 | 3:10 AM

అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల అమలు

07-03-2026 12:29 AM

ఘనంగా ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక

మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి

దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

మహబూబాబాద్, మార్చి 6 (విజయక్రాంతి): అర్హులైన ప్రతి లబ్ధిదారుకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా అధికారులు కృషి చేయాలని, ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి తీసుకువెళ్లాలని, 99 రోజులపా టు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమా న్ని ప్రతిష్టంగా అమలు చేయాలని అధికారులకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొం డా సురేఖ దిశా నిర్దేశం చేశారు.

ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్ర మంపై మహబూబాబాద్ ఐడీఓసి కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాల కలెక్టర్లతో పాటు అధికార వర్గాలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నా యక్, ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డా క్టర్ జాటోత్ రామచందృ నాయక్, ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్యేలు డాక్టర్ భూక్యా మురళి నాయక్, దొంతి మా ధవరెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, కే.ఆర్ నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి,వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, కూడా చైర్మన్ ఇనుగల వెంకట్రామిరెడ్డి, ఉమ్మడి జి ల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పా ల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ నెల 6వ తేదీ నుండి జూన్ 12వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని ప్రతిష్టా త్మకంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గుర్తించిన సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు.

విద్యా, వైద్య రంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల కొర తను తీర్చాలని, అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలని చెప్పారు. ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో కూడా వైద్య సేవ లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఎలాంటి కొరత ఉండకుండా చూడాలని సూచించారు. ఉపయోగంలో లేని వైద్య పరికరాలను తొలగించి, అవసరమైన పరికరాలను, తగిన సిబ్బందిని నియ మించి వాటిని సమర్థంగా వినియోగంలోకి తేవాలని పేర్కొన్నారు. పాఠశాలలవాహనాలు ఫిట్ నెస్ లేకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

జీపీఎస్ ద్వారా పాఠశాల వాహనాలు పర్యవేక్షణ చేయాలని తెలిపారు. స్లమ్ ఏరియాల్లో నివసిస్తున్న ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని, ఉందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలని, ఎక్కడైనా నిధులు మంజూరు సమస్య ఉంటే నివేదికలు పంపాలని తెలిపారు. అనర్హులకు ఇండ్లు మంజూరు చేస్తే కలెక్టర్లు బాధ్యులు అవుతారని పేర్కొన్నారు. అటవీ ప్రాంతాల్లో పాత ఇల్లు ఉన్న స్థలాల్లో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవడానికి ఆటంకా లు కలిగించదని అటవీశాఖ అధికారులను ఆదేశించారు.

అటవీ శాఖ రెవెన్యూ శాఖ భూ సమస్య పరిష్కారానికి సంయుక్తంగా స ర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించాలని ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ సమ స్య బాగా ఉందని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే అటవీ ప్రాంతాల్లో ఉన్న పాత రహదారుల అభివృద్ధికి ఆటంకాలు కలిగించకూడదని సూచించారు. భూభారతిలో ఇచ్చిన పట్టాలు పెండింగ్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, ఇందులో ఎక్కడైనా అక్రమాలు జరిగితే సహించేది లేదని చెప్పారు.

కలెక్టర్లు, ఇరిగేషన్ అధికారులు ఇరిగేషన్ సంబంధించిన పనులు పెండింగ్లో పెట్టవద్దని రోడ్లు కెనాల్ ఇతర అభివృద్ధి పనులకు భూసేకరణ పూర్తి చేయాలన్నారు. వినియోగంలో లేని పాత భవనాలను తొలగించి, కొత్త భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ప్రధానంగా పాఠశాలలకు ఇందులో అధిక ప్రాధాన్యం ఇవ్వా లన్నారు. అర్హులైన మహిళలను మహిళా సంఘాల్లో సభ్యులుగా చేర్చాలని, మహిళా పథకాలకు సంబంధించి అన్ని కార్యక్రమాలను 99 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.

ప్రతి జిల్లాలో ఒకటి చొప్పున ఏకో పార్కు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి హస్టల్ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించి తనిఖీలు చేయాలని, విద్యార్థులతో కలిసి భోజనాలు చేయాలని తెలిపారు. గ్రామ, మండల స్థాయిలో ప్రభు త్వం ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారుల జాబి తా తయారు చేయాలని తెలిపారు. ప్రతి ఇంటికి ప్రజా ప్రతినిధుల సహకారంతో వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించాలన్నారు. మార్చి నెలాఖరు వరకు ఇందిరమ్మ ఇండ్లు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని, గ్రౌండ్ కాని ఇండ్లు లబ్ధిదారుల నుండి అంగీకారాన్ని తీసుకుని రద్దు చేయాలని తెలిపారు.

మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల న్నారు. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కార స్థితిని దరఖాస్తుదారులు తెలుసుకునేలా ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించి సమాచారం వారి సెల్ఫోన్లకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మండల స్థాయిలో ఆరో గ్య సదస్సులు నిర్వహించి వైద్య పరీక్షలు చేపట్టాలని మంత్రి పేర్కొన్నారు. అలాగే గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఛైర్మన్లకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.