16 July, 2026 | 1:04 AM

150వ రోజుకు చేరిన నిరసన దీక్ష

16-07-2026 12:53 AM

గట్టు, జులై 15: భారత్మాల జాతీయ రహదారి నిర్మాణంలో స్థానిక ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన నిరసన దీక్షలు గురువారం నాటికి 150వ రోజుకు చేరుకున్నాయి. కొత్తగా నిర్మిస్తున్న జాతీయ రహదారిపై అండర్పాస్ ఏర్పాటు చేయడంతో పాటు రాయపురం స్టేజీ సమీపంలోని రెండు వరుసల రోడ్డు వద్ద వంతెన (బ్రిడ్జి) నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం టీసీఎస్ మాజీ అధ్యక్షుడు రాముడు ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షలు నిరంతరంగా కొనసాగుతున్నాయి. స్థానిక ప్రజల సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే పరిశీలించి పరిష్కారం చూపాలని నిరసనకారులు కోరారు. డిమాండ్లు నెరవేరే వరకు తమ ఉద్యమాన్ని విరమించబోమని గ్రామస్తులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాముడు మహాదేవప్ప, అమ్మన్న, వీరేష్, వెంకటన్న, తిమ్మప్ప, కృష్ణయ్య, సాలె కర్రెప్ప, జనార్ధన్, సుధాకర్  పాల్గొన్నారు.