10 April, 2026 | 10:11 PM

రుద్రారం శివారులో అక్రమ ఇసుక టిప్పర్ సీజ్... ఒకరి అరెస్ట్

10-04-2026 07:31 PM

నవాబ్ పేట: మండల పరిధిలోని రుద్రారం గ్రామ శివారులో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఒక టిప్పర్‌ను నవాబ్‌పేట పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. సివిల్ పోలీస్ కానిస్టేబుల్ ఎం. రాజు (నెం. 2320), హోంగార్డు ప్రసాద్ (HG-429) కలిసి శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో రుద్రారం శివారులో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో మహబూబ్‌నగర్ రోడ్డు వైపు నుండి వస్తున్న ఒక టిప్పర్‌ను ఆపి తనిఖీ చేయగా, అందులో అనుమతి లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఇసుక బయటపడింది. టిప్పర్ డ్రైవర్ శ్రీహరి (29), తండ్రి మల్లేష్, మహబూబ్‌నగర్ నివాసిగా గుర్తించారు.

ఎటువంటి అనుమతులు లేకుండా దొంగతనంగా ఇసుకను నింపుకుని, రుద్రారం మరియు పరిసర గ్రామాల్లో విక్రయించి డబ్బు సంపాదించడమే లక్ష్యంగా ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు నిందితుడు విచారణలో అంగీకరించాడు.పోలీసులు TS-08-UF-2732 నంబర్ గల టిప్పర్‌ను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కానిస్టేబుల్ రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై Cr.No: 28/2026 కింద BNS సెక్షన్ 303(2) మరియు MMDR చట్టంలోని సెక్షన్ 21(1) ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌ఓ (HC 1554) తెలిపారు. ఈ కేసుపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.