మియాపూర్‌లో అక్రమ బోర్‌వెల్స్ సీజ్
24-06-2026 12:36 AM
- ‘విజయక్రాంతి’ కథనానికి స్పందించిన హెచ్‌ఎండీఏ అధికారులు
- నీటి దోపిడీదారులపై కేసులు నమోదు
శేరిలింగంపల్లి, జూన్ 23(విజయక్రాంతి): మియాపూర్ సర్వే నంబర్ 100, 101లోని ప్రభుత్వ భూముల్లో సాగుతున్న నీటి దోపిడీపై ‘విజయక్రాంతి’ దినపత్రిక ప్రచురించిన కథనాని కి అధికారులు తక్షణమే స్పందించారు.
రంగంలోకి హెచ్‌ఎండీఏ..
పత్రికా కథనంతో కదలిక వచ్చిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ బృందాలు క్షేత్రస్థాయిలో విచారణ జరిపాయి. నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య ప్రయోజనాల కోసం తవ్విన అక్రమ బోర్‌వెల్‌లను అధికారులు సీజ్ చేసి, బాధ్యులపై చట్టపరమైన కేసులు నమోదు చేశారు. భూగర్భ జలాల ను తోడేస్తున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చిన ‘విజయక్రాంతి’కి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.






