24 June, 2026 | 2:46 AM

రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలి

24-06-2026 01:21 AM

ఎమ్మెల్యే విజయుడు

అలంపూర్, జూన్ 23:  అలంపూర్ నియోజకవర్గంలోని వడ్డేపల్లి మండల రైతు వేదిక వద్ద మంగళవారం నిర్వహించిన విత్తన మేళా పంపిణీ కార్యక్రమంలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ రైతులు దేశానికి వెన్నెముక లాంటి వారని కొనియాడారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించి అధిక దిగుబడులు సాధించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

విత్తన మేళా ద్వారా రైతులకు సన్న వడ్లు, పప్పు దినుసులు, నూనె గింజలు, కూరగాయల విత్తనాలు, నానో యూరియా, నానో డీఏపీ తదితర వ్యవసాయ అవసరాలను అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పంటల దిగుబడిని పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్లు వడ్డేపల్లి సూరి, యుగంధర్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.