24 June, 2026 | 2:38 AM

‘ఏటీఎం’ డబ్బుల చోరీ!

24-06-2026 01:19 AM
  1. మిషిన్‌లో డబ్బులు నింపేందుకు వెళ్లిన సిబ్బంది
  2. బయట వ్యాన్‌లో ఉన్న రూ.17 లక్షలు ఎత్తుకెళ్లిన ఇద్దరు దుండగులు
  3. ఆ తర్వాత కనిపించకుండా పోయిన ఏటీఎం వ్యాన్ డ్రైవర్
  4. హైదరాబాద్‌లోని మలక్‌పేటలో ఘటన
  5. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు

మలక్‌పేట్, జూన్ 23 (విజయక్రాంతి): ఏటీఎంలకు నగదు సరఫరా చేసే వాహనంలో ఉన్న రూ.17 లక్షల నగదును ఇద్దరు దుండగులు చోరీ చేసి పరారయ్యారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. రీనబజార్ ప్రధాన రహదారిపై ఉన్న ఏటీఎంలో నగదు నింపేందుకు నగదుతో వ్యాన్‌లో సిబ్బంది చేరుకు న్నారు. ఏటీఎంలో నగదు నింపేందుకు సిబ్బంది లోనికి వెళ్లగా బయట వ్యాన్‌లో ఉన్న రూ.17 లక్షల నగదును బైక్‌పై వచ్చిన ఇద్దరు దండగులు ఎత్తుకెళ్లారు.

ఆ తర్వాత వ్యాన్ డ్రైవర్ కూడా కనిపించకుండా పో యాడు. సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చే యడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రా రంభించారు. నిందితుడు తప్పించుకున్న మార్గాలను గుర్తించేందుకు పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్నారు. వ్యాన్ డ్రైవర్ ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.