23 June, 2026 | 6:46 PM

ప్రీవెడ్డింగ్ షూట్‌లో ప్రియుడితో కలిసి కాబోయే భర్తను చంపిన యువతి

23-06-2026 05:24 PM

పూణే: మహారాష్ట్రలోని పూణేలో స్థిరాస్తి వ్యాపారి కేతన్ విశాల్ మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రీ వెడ్డింగ్ షూట్(pre wedding shoot)లో ప్రియుడితో కలిసి యువతి కాబోయే భర్తును చంపేసింది. ప్రీ వెడ్డింగ్ షూట్ లో కేతన్ విశాల్ కోటపైనుంచి జారిపడ్డాడని సియా గోయల్  తెలిపింది. పెళ్లి ఇష్టం లేకే విశాల్ ను లోయలోకి తోసి హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. ఈ నెల 18న కోట పైనుంచి 400 అడుగుల లోయలోపడి విశాల్ చనిపోయాడు.

యువతి ఫోన్ రికార్డులు, లావాదేవీల పరిశీలనతో వాస్తవం వెలుగులోకి వచ్చింది. విశాల్ ను ప్రియుడితో కలిసి తానే చంపినట్లు సియా గోయల్ పోలీసులు విచారణలో అంగీకరించింది. మే 31న లోహగఢ్ కోటలో హత్యకు విఫలయత్నం చేసిందని పోలీసులు వెల్లడించారు. ఈ నెల 18 న పుట్టినరోజు పేరుతో విశాల్ ను మరోసారి సియా కోటకు తీసుకెళ్లినట్లు పోలీసులు పేర్కొన్నారు. వీరి వివాహం కోసం రూ. 17 కోట్ల విలువైన ప్యాలెస్‌ను బుక్ చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.