24 June, 2026 | 1:21 AM

‘పది’ తల్లిదండ్రులకు గాలం

24-06-2026 12:45 AM
  1. కార్పొరేట్ కళాశాలలు వేట ప్రారంభం
  2. ఇంటర్‌ అడ్మిషన్ల కోసం ఆఫర్ల వెల్లువ
  3. అయోమయానికి గురవుతున్న తల్లిదండ్రులు
  4. అడ్డగోలు దోపిడీకి రంగం సిద్ధం చేసిన కార్పొరేట్ సంస్థలు 
  5. నిబంధనలు కాగితాలకే పరిమితమయ్యాయి..

బోధన్, జూన్23 (విజయక్రాంతి): పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు గాలం వేస్తున్నాయి. తెలంగాణలో మార్చి 18 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు ఇంకా త్వరలోనే విడుదల కానున్నాయి. కానీ కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల కోసం వేట మొదలు పెట్టాయి. ప్రైవేటు కళాశాలల మధ్య నె లకొన్న తీవ్ర పోటీతో సాధ్యమైనంత వరకు అడ్మిషన్లు ముందే పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నారు.

బోధన్ పట్టణంలోని పలు కార్పొరేట్ విద్యా సంస్థలు ముందస్తు అడ్మిష న్లు ఇప్పటికే ప్రారంభించాయి. దానికనుగుణంగా తమ సిబ్బందిని గ్రామాల్లో ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి మా కళాశాలలో చేరండని కొర్పొరేట్ సంస్థల పీఆర్వోలు అంటున్నారు. అడ్మిషన్ల సమయం లోనే ఎంబీబీఎస్ ర్యాంకులు, ఐఏఎస్, ఐపీఎస్ అంటూ మభ్యపెడుతున్నారు. మండల వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 1010 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. 2026 మార్చ్ అక్టోబర్, నవంబర్ నుంచే పదో తరగతి విద్యార్థుల జాబితా సేకరించి కార్పొరేట్ విద్యా సంస్థలు అడ్మిషన్లు చేసుకుంటున్నారు.

జిల్లాలోని అన్ని పట్టణాలతో పాటు గ్రామాల్లో సైతం పీఆర్వోలను దించేసి నిర్ణయించిన మేరకు అడ్మిషన్లు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే గ్రామాల్లో పీ ఆర్వోలు తల్లిదండ్రుల దగ్గర అడ్మిషన్ ఫీజు కింద రూ.2 వేలు కట్టించుకుంటున్నారు. కార్పొరేట్ సంస్థల పీఆర్ వోలు చేరే ముందు ఒక ఫీజు, చేరిన తర్వాత ఇంకో విధంగా ఫీజులు వసూలు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నిబంధనలు కాగితాలకే ..

పదో తరగతి పరీక్షలు విడుదలయ్యాక జూన్ లో ఇంటర్ ప్రవేశాలు ఉంటాయి. కానీ పలు సంస్థలు పీఆర్వోల ద్వారా ఆర్భాటపు ప్రచారాలు చేస్తూ మా పిల్లల్ని, మమ్మల్ని అయోమయానికి గురిచేస్తున్నారు. విద్యాశాఖ నిర్లక్ష్యంతో నిబంధనలు కాగితాలకే పరిమితమయ్యాయి.

మా కాలేజీలో చేర్పించండి అంటున్నారు

మీ కూతురును బాగా చదువు పిస్తాం అందుకని వచ్చాం. మా కాలేజీలోనే చేర్పించండి అని అంటున్నారు. మా ఇంటి వద్దకు వచ్చి ప్రైవేటు విద్యాసంస్థలు ఎంపీసీ తీసుకోండి రూ.25 వేలు సంవత్సరానికి కట్టండని అంటున్నారు. మా దగ్గర డబ్బులు లేవు మేము ప్రభుత్వ కాలేజీకి మాత్రమే పంపుదామని అనుకుంటున్నాం అని చెప్పాం.

- మేతరి రేఖ. అక్బర్ నగర్ రుద్రూర్ మండల్  టెన్త్ విద్యార్థుల తల్లిదండ్రులు

నాణ్యమైన విద్యనందిస్తామన్నారు

మా కాలేజీలో చేర్పిస్తే  నాణ్యమైన విద్యనందిస్తామన్నారు. సాఫ్ట్వేర్, ఉద్యోగులు సైంటిస్టులు ,సివిల్ ఇంజనీర్లను, తయారు చేస్తున్నామన్నారు. అంటూ చెబుతున్నారు. మా కాలేజీ క్రమశిక్షణ కలిగిన కాలేజీ లంటూ ఇంటికి వచ్చి అడ్మిషన్లు తీసుకున్నారు.

- బోర్గం , నాగొల్ల పోశెట్టి, రెంజల్ మండలం టెన్త్ విద్యార్థుల తల్లిదండ్రులు