24 June, 2026 | 2:34 AM

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సత్యనారాయణ స్వామి వ్రతం

24-06-2026 01:19 AM

నాగర్ కర్నూల్, జూన్ 23 (విజయక్రాంతి):  నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి జన్మదినం సందర్భంగా మంగళవారం పార్టీ కార్యకర్తలు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, ప్రత్యేక పూజలు నిర్వహించగా ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం రక్తదాన శిబిరం నిర్వహించడంతో పాటు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం చేపట్టి రోగులు, వారి సహాయకులకు భోజనం పంపిణీ చేశారు. కొల్లాపూర్ చౌరస్తాలోని అనాథాశ్రమంలో చిన్నారులకు నూతన దుస్తులు అందజేశారు. జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో నిర్వహించిన ఎమ్మెల్యేను పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందించారు.