రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ భేటీ
24-06-2026 01:20 AM
కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణకు సంకేతాలా?
న్యూఢిల్లీ, జూన్ 23 (విజయక్రాంతి): త్వరలోనే కేంద్ర కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ ఉండొచ్చన్న సంకేతాలకు ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము భేటీ బలం చేకూరుస్తుంది. మంగళవారం పద్మ అవార్డుల ప్రదానోత్సవం అనంతరం రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు.
ఇందుకు సంబంధించిన ఫోటోలను రాష్ట్రపతి కార్యాలయం ‘ఎక్స్’ వేదికగా విడుదల చేసింది. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో మరింత మంది మంత్రులకు పార్టీ బాధ్యతలను అప్పగిస్తారనే ప్రచారం జరుగుతుంది. దీంతో రాబోయేరోజుల్లో మరింతమంది రాజీనామా చేసే అవకాశం ఉందనే వాదనలు వినబడుతున్నాయి. అదే సమయంలో కొత్తవారిని మంత్రివర్గంలో తీసుకుంటారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.






