14 May, 2026 | 2:04 AM

కమిటీలతో కాలయాపన చేస్తే ఉద్యమమే

14-05-2026 01:12 AM

తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ హెచ్చరిక

ముషీరాబాద్, మే 13 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలంతోపాటు రూ.25 వేల గౌరవవేతనం ఇవ్వా లని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ డి మాండ్ చేసింది. కమిటీలతో ప్రభుత్వం కాలయాపన చేస్తే మరో ఉద్యమం తప్పదని హె చ్చరించింది. ఈ మేరకు బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి మాట్లాడారు.

ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు, సంక్షేమబోర్డు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే రూ.25 లక్షల సామాన్య, ప్ర మాద బీమాతోపాటు 50 శాతం సబ్సిడీతో కోటి రూపాయల రుణం అందజేయాలన్నారు. ఉద్యమకారులను విస్మరించిన గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చారిత్రక తప్పిదం చేసిందన్నారు. ఈ సమావేశంలో జేఏసీ నేత లు మల్లేష్, యాదగిరి, రహిమున్నిసా బేగం, శోభారాణి, శ్రీశైలం, లక్ష్మి, శారద పలు జిల్లాల బాధ్యులు పాల్గొన్నారు.