9 May, 2026 | 2:54 AM

సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన తప్పదు

09-05-2026 01:38 AM

ఉద్యోగుల మౌన నిరసన*

ఖమ్మం టౌన్, మే 8 (విజయ క్రాంతి):  ఎస్ బి ఐ బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాకుంటే ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని ఆలిండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ నాయకులు కె. రాంబాబు హెచ్చరించారు. ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం ఎస్బీఐ ఖమ్మం రీజినల్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు మౌనం పాటించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా కె. రాంబాబు మాట్లాడుతూ ఆలిండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ ప్రభుత్వం ముందు 16 డిమాండ్లను ఉంచిందన్నారు.

శాశ్వత ఉద్యోగాల అవుట్సెర్సింగ్ నిలిపివేయడం, తగిన సిబ్బందిని నియమింకపోవడం ఉద్యోగులకు ఇబ్బందికరంగా మారిందని రాంబాబు తెలిపారు.   న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోతే మే 25, 26 తేదీల్లో రెండు రోజుల పాటు దేశ వ్యాప్త సమ్మెను చేపడతామని దీనిని విజయవంతం చేయాలని రాంబాబు ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు.