9 May, 2026 | 2:55 AM

హుజూర్ నగర్ పట్టణ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం

09-05-2026 01:38 AM

మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్

ఫ్లోర్‌లీడర్ కోతిసంపత్ రెడ్డి

హుజూర్ నగర్, మే 8: హుజూర్ నగర్ పట్టణ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్,ఫ్లోర్ లీడర్ కోతి సంపత్ రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని 16వ వార్డు డ్రైనేజీ పనులను ప్రారంభించి మాట్లాడారు... రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో మున్సిపాలిటీలోని 28 వార్డులలో పలు సమస్యలను గుర్తించి విడతల వారీగా అభివృద్ధి పనులను, మౌలిక సదుపాయాల కల్పనలో ఎక్కడ కూడా రాజీ పడబోమన్నారు.

పట్టణంలో పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని డంపింగ్ యార్డ్ కోసం స్థల పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాస్,మున్సిపల్ కౌన్సిలర్లు, ఫ్లోర్ లీడర్ కోతి సంపత్ రెడ్డి, సులువ నాగలక్ష్మి చందు, బాబురావు,చిట్టిప్రోలు భద్రమ్మ, రమేష్, మున్సిపల్ సిబ్బంది, తదితరులు,పాల్గొన్నారు.