సికింద్రాబాద్ అభివృద్ధికి సహకరిస్తా
- మంత్రి పొన్నం ప్రభాకర్
- మంత్రిని కలిసిన వివిధ పార్టీ నాయకులు
సికింద్రాబాద్, మే 3 (విజయక్రాంతి): సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆదమ్ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ నియోజకవర్గంకి చెందిన వివిధ పార్టీల నాయకులు తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ వల్లారపు శ్రీనివాస్ కుమార్, సిపిఐ కార్యదర్శి కాంపల్లి శ్రీనివాస్, బిఎస్ పి ఇంచార్జ్ నర్సింగ్ రావు తో కూడిన బృందం హైదరాబాద్ జిల్లా ఇం చార్జ్,రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ని మర్యాదపూర్వకంగా వారినివాసంలో కలిసి, సీతాఫలమండి ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలకు మంజూరైన ౩౦ కోట్ల నిధుల విడుదల కొరకై, పనులను వెంటనే ప్రారంభించేలా చొరవ తీసుకోవాలని అలాగే తార్నాకలోని విజయ డైరీ ప్రభుత్వ పాఠశాలను శాశ్వత భవనంలో పునరుద్దరించాలని వినతి పత్రం సమర్పించారు.
అనంతరం జిల్లా ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌ని ఆయొక్క ప్రాంగణా లను ప్రత్యక్షంగా వెళ్లి పరిశీలించి నివేదిక సమర్పించవలసిందిగా ఆదేశాలు జారీచేశారు.తదనంతరం సమస్యను సంబంధిత జిల్లా ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాక ర్ దృ ష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న ఆదం సంతోష్ కుమార్ కి వల్లారపు శ్రీనివాస్, కాంపల్లి శ్రీనివాస్, నర్సింగరావులు కృతఙ్ఞతలు తెలియజేశారు.






