31 July, 2026 | 2:25 AM

ఐ యామ్ గేమ్.. ఫైరీ వైబ్!

31-07-2026 01:20 AM

దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న తాజాచిత్రం ‘ఐ యామ్ గేమ్’. ఈ చిత్రానికి నహాస్ హిదాయత్ దర్శకత్వం వహిస్తున్నారు. దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ వేఫేరర్ ఫిలమ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీకి సాజిర్ బాబా, ఇస్మాయిల్ అబూబక్కర్, బిలాల్ మొయిదు స్క్రీన్‌ప్లే అందించగా, సాజిర్ బాబా, ఆదర్శ్ సుకుమారన్, షబాస్ రషీద్ సంభాషణలు రాశారు.

దుల్కర్ సల్మాన్ కెరీర్‌లో 40వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్‌లో ఆంటోనీ వర్గీస్, మిస్కిన్, కాయడు లోహర్, కథిర్, పార్థ్ తివారీ, సంయుక్త విశ్వనాథన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 20న ఓణం పండుగ కానుకగా థియేటర్ల ద్వారా మలయాళం, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ లాంచ్ చేశారు. ఈ సందర్భగా సోషల్ మీడియాలో “ఐయామ్ గేమ్’ ట్రైలర్‌లోని ఆ ఫైరీ వైబ్ నాకు బాగా నచ్చింది.

మొదటి నుంచి చివరి వరకు ఎంతో గ్రిప్పింగ్‌గా, ఎంగేజింగ్‌గా సాగింది. దుల్కర్ మరో స్పెషల్ మూవీతో వస్తున్నారని నమ్మకం కలిగింది” అంటూ స్పెషల్ పోస్ట్ పెట్టారు యంగ్ టైగర్. ట్రైలర్ చూస్తే.. ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే ఎడ్జ్- ఆఫ్ ది -సీట్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్నట్టు తెలుస్తోంది. అల్ట్రా-స్టైలిష్, మాస్ అవతార్‌లో దుల్కర్ సల్మాన్ ఈ ట్రైలర్‌లో కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జిమ్షీ ఖలీద్; సంగీతం: జేక్స్ బిజోయ్; సాహిత్యం: మను మంజిత్, వినాయక్ శశికుమార్; ఎడిటింగ్: చమన్ చాకో; ప్రొడక్షన్ డిజైన్: అజయన్ చలిసేరి.