31 July, 2026 | 3:27 AM

న్యూటన్స్ థర్డ్ లా నిరాశపరచదు!

31-07-2026 01:19 AM

సుమంత్ హీరోగా నటించిన యూనిక్ థ్రిల్లర్ ‘న్యూటన్స్ థర్డ్ లా’. రాజేశ్ కర్ణ దర్శకత్వం వహించిన చిత్రాన్ని కే హరీశ్ నిర్మించారు. ఈటీవీ విన్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 31న థియేటర్లలోకి రానుంది. ఈ మూవీ ప్రిమియర్స్ సందర్భంగా మేకర్స్ యాక్షన్ రియాక్షన్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ప్రెస్‌మీట్‌లో హీరో సుమంత్ మాట్లాడుతూ.. “ఇది కొత్త తరహా థ్రిల్లర్ అయినప్పటికీ, ఇందులో బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయి.

ప్రీమియర్స్‌కు చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది” అన్నారు. ‘ఈ సినిమా ప్రేక్షకులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశపరచద’ని దర్శకుడు రాజేశ్ కర్ణ తెలిపారు. నిర్మాత హరీశ్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ స్క్రీన్‌ప్లే’ అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఈటీవీ విన్ సాయికృష్ణ, నటీనటులు నేహా, రవివర్మ, త్రినాథ్, డీవోపీ వేదవ్యాస్ తదితర చిత్రబృందం అంతా ఈ కార్యక్రమంలో మాట్లాడారు.