21 June, 2026 | 4:01 AM

విజయవంతంగా హెచ్‌వైఎస్‌ఈఏ ప్రాజెక్ట్ ద్రోణ 2.0

21-06-2026 12:00 AM

స్టాన్లీ కాలేజ్ ఆధ్వర్యంలో నిర్వహణ

హైదరాబాద్, జూన్ 20(విజయక్రాంతి): స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్లోని సమాచార సాంకేతిక విభాగానికి చెందిన సహాయ ఆచార్యురాలు టీసీ శ్వేత ప్రియ, హెచ్‌వైఎస్‌ఈఏ ఆధ్వర్యం లో, టాస్క్(తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్) సహకారంతో, ఇన్‌ఫోసిస్ స్ప్రింగ్ బోర్డు మద్దతుతో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక అధ్యాపకుల నైపుణ్యాభివృద్ధి, పరిశ్ర మ అనుభవ కార్యక్రమమైన హెచ్‌వైఎస్‌ఈఏ ప్రాజెక్ట్ ద్రోణ 2.0ను విజయవంతంగా పూర్తి చేశారు.

ఈ కార్యక్రమం అధ్యాపకులకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను అం దించి, పరిశ్రమ విద్యా సంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం ద్వారా భవి ష్యత్ అవసరాలకు అనుగుణమైన విద్యార్థులను తీర్చిదిద్దడం లక్ష్యంగా నిర్వహించారు. ఫేజ్‌Iలో భాగంగా శ్వేత ప్రియ కృత్రిమ మేధ స్సు, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లె ర్నింగ్, జనరేటివ్ ఏఐ, ప్రాంప్ట్ ఇంజినీరింగ్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, రిట్రీవల్-ఆగ్మెంటెడ్ జనరేషన్, డేటా సైన్స్ కోసం పైథాన్, డేటా విజువలైజేషన్, బాధ్యతాయుత ఏఐ వంటి ఆధునిక సాంకేతిక అంశాలలో సుదీర్ఘ శిక్షణ ను విజయవంతంగా పూర్తి చేశారు.

ఫేజ్‌II లో, పరిశ్రమ నిపుణుల మార్గదర్శకత్వంలో, ఆధునిక ఏఐ, డేటా ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి వాస్తవ ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను అందించే క్యాప్‌స్టోన్ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా పూర్తి చేశా రు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూ ర్తి చేసినందుకు గుర్తింపుగా శనివారం నిర్వహించిన ప్రాజెక్ట్ ద్రోణ 2.0 కాన్వొకేషన్ వే డుకలో శ్వేతప్రియకి ప్రాజెక్ట్ ద్రోణ 2.0 కంప్లీషన్ సర్టిఫికెట్ ప్రదానం చేశారు. ఈ సర్టిఫికె ట్‌ను ప్రొఫెసర్ వి.బాలకిష్ణారెడ్డి నాయకత్వం లో అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, అధ్యాపక బృం దం టీసీ శ్వేతప్రియని అభినందించారు. ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సా ధించాలని ఆకాంక్షించారు.