యోగా సంపూర్ణ ఆరోగ్య సాధన
- మనిషి ఎక్కువ కాలంగా ఆరోగ్యంగా ఉంటాడు
- డాక్టర్ సుధీంద్ర, కన్సల్టెంట్ లైప్ స్టుల్ రిహాబిలిటేషన్ కిమ్స్ హాస్పిటల్ సికిందరాబాద్
- నేడు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా..
హైదరాబాద్, జూన్ 20(విజయక్రాంతి): యోగా అనేది కేవలం వ్యాయామం మాత్ర మే కాదు.. ఇది శరీరం, మనసు, మెదడు అన్నింటిపైనా మంచి ప్రభావం చూపే ఒక సంపూర్ణ ఆరోగ్య సాధన. వైద్య పరిశోధనలు చెబుతున్నదేమంటే యోగా వృద్ధాప్యాన్ని ఆరోగ్యంగా మార్చడంలో సహాయపడుతుం ది. యోగా వల్ల మెదడు, నరాల వ్యవస్థ, హా ర్మోన్లు, కండరాలు, ఎముకలు వ్యవస్థలు బలంగా పని చేస్తాయి. దీంతో మనిషి ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించగలుగుతాడు.
ఈ సంవత్సరం యోగా దినోత్సవ థీమ్ ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి యోగా. దీని అర్థంవయస్సు పెరిగినా ఆరోగ్యంగా, చురుకుగా ఉండటం. నేడు ప్రపంచ యోగా దినో త్సవం సందర్భంగా.. యోగా ఎలా ఉపయోగపడుతుందో సికిందరాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్స్‌కు చెందిన కన్సల్టెంట్ లైఫ్ స్టుల్ అండ్ రిహాబిలిటేషన్ డాక్టర్ సుధీంద్ర వివరించారు. ముఖ్యంగా శరీరాన్ని రక్షిస్తుంది.. యోగా వల్ల శరీరంలో హానికర పదార్థాలు తగ్గుతాయి. కణాలు నశించకుండా రక్షణ పొందుతాయి.
దీని వల్ల షుగర్, గుండె రోగా లు, వయస్సుతో వచ్చే సమస్యలు తగ్గుతా యి. మెదడు పదును పెరుగుతుంది. యోగా చేస్తే జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. వయస్సుతో మెదడు బలహీనమవడం నెమ్మది స్తుంది. లోతైన శ్వాస వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది. నిద్ర బాగుంటుంది.
శరీరం చురుకుగా ఉంటుం ది.. యోగా వల కీళ్లు కదలికలు మెరుగవుతాయి, కండరాలు బలంగా ఉంటాయి పడి పోవడం ప్రమాదం తగ్గుతుంది. ఎముకలు బలంగా ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.. యోగా వల్ల రక్తపోటు తగ్గుతుం ది. గుండెపై ఒత్తిడి తగ్గుతుంది. షుగర్ నియంత్రణలో కూడా సహాయపడుతుంది.
వృద్ధులు పాటించాల్సిన జాగ్రత్తలు
వయస్సు పెరిగే కొద్దీ ఎముకలు, కీళ్లు, గుండె కొంచెం సున్నితంగా మారుతాయి. కాబట్టి జాగ్రత్త అవసరం. ఎముకలు బలహీనంగా ఉన్నవారు.. ఎక్కువగా ముందుకు వంగే ఆసనాలు చేయకూడదు, వెన్నెముక నేరుగా ఉంచాలి, నెమ్మదిగా, సులభమైన కదలికలు చేయాలి. గుండె / కంటి సమస్యలు ఉన్నవారు.. తలకిందులుగా చేసే ఆస నాలు చేయకూడదు, ఒక్కసారిగా లేచే కదలికలు చేయకూడదు, నెమ్మదిగా స్థితి మార్చాలి.
కీళ్ల నొప్పులు లేదా ఆపరేషన్ చేసినవారు.. లోతుగా కూర్చునే ఆసనాలు చేయ కూడదు, కుర్చీపై యోగా చేయడం మంచిది, మోకాళ్లపై ఒత్తిడి తగ్గించాలి. శ్వాస వ్యాయామాలు.. వేగంగా శ్వాస తీసుకునే వ్యాయామాలు చేయకూడదు, శ్వాసను ఆపి చేసే వ్యాయామాలు వద్దు, నెమ్మదిగా శ్వాస తీసుకోవడం మంచిది.
ముఖ్య సూచనలు:
యోగా మొదలుపెట్టే ముందు డాక్టర్ సలహా తీసుకోవాలి. షుగర్, బీపీ, ఎముకల పరీక్షలు చేయించుకోవాలి, తల తిరగడం, నొప్పి ఉంటే ఆపేయాలి. సురక్షిత వాతావరణం.. జారకుండా ఉండే మట్టులు ఉపయో గించాలి, యోగా మ్యాట్, దిండు వంటి సహాయ వస్తువులు వాడాలి, శరీరాన్ని బలవంతం చేయకూడదు. నెమ్మదిగా, సౌకర్యం గా చేయాలి. ముగింపు..యోగా అనేది వృ ద్ధాప్యాన్ని ఆపేది కాదు, కానీ వృద్ధాప్యాన్ని ఆరోగ్యంగా మార్చేది. దీని వల్ల శరీరం మాత్రమే కాదు, మనసు కూడా ప్రశాంతం గా, ఆరోగ్యంగా ఉంటుంది.






