ఇంకెంతమంది చావాలి?
- నర్సంపేట డిపో డ్రైవర్ ఆత్మహత్యా ప్రయత్నానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి
- బలవన్మరణాలతో సమస్యలు పరిష్కారం కావు: ఆర్టీసీ జేఏసీ నేతలు
- ఉద్యమ కార్యాచరణను ప్రకటించిన జేఏసీ
హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): ఇంకెంత మంది చావాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆర్టీసీ జేఏసీ ప్రశ్నిచింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన 3 ప్రధాన డిమాండ్లను పక్కకు పెట్టి, మిగిలిన 29 డి మాండ్లను పరిష్కరించామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పిన అబద్ధపు మాటలతోనే కలత చెంది నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్‌గౌడ్ ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నారని జేఏసీ నేతలు తెలిపారు.
గత ప్రభుత్వం లాగే ఈ ప్రభుత్వం వవ్యహరిస్తోందని తట్టుకోలేక క్షణికావేశంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. 70 శాతం కాలిన గాయాలతో వరంగల్‌లోని ఎంజీఎం హాస్పిటల్‌లో చికి త్స పొందుతున్నారని, పస్తుతం ప్రాణాపా య స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని తెలిపారు. ఈ దుర్ఘటన పట్ల జేఏసీ తీవ్ర దిగ్భ్రాం తికి గురైందని జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్‌చైర్మన్ థామస్‌రెడ్డి, కన్వీనర్ ఎండి.మౌలానా, కో కన్వీనర్లు సుద్దాల సురే ష్, కత్తుల యాదయ్య, బీ యాదగిరి గురువారం ఒక ప్రకనటలో పేర్కొన్నారు.
న్యాయ మైన డిమాండ్ల సాధన కోసం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 34 మంది ఆర్టీసీ కా ర్మికులు ఆత్మబలిదానం చేసుకుంటే, ఈ కాం గ్రెస్ ప్రభుత్వం ఇంకెంతమంది ఆర్టీసీ కార్మికులు బలిదానాలు చేసుకుంటే దిగివస్తుందో చెప్పాలని విమర్శించారు. ఇప్పటివరకు శాం తియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మిక వర్గంపై ఉక్కుపాదం మోపుతూ, డిపోలలో వేసుకున్న టెంట్లను పోలీసులతో కూల్చివేయించిందన్నారు.
అక్కడి నుంచి నిర్దాక్షిణ్యంగా కార్మికులను తరిమి కొడుతున్నారని, ఇదేనా ప్రజాపాలన అని ముఖ్యమంత్రిని జేఏసీ నాయకులు ప్రశ్నించారు. నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్‌గౌడ్‌కు ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా, వెంటనే మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఈ ఆత్మహత్య సంఘటనకు ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వాలే బా ధ్యత వహించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముఖ్యమంత్రి స్పం దించి సమ్మె డిమాండ్లను పరిష్కరించి, స మ్మెను విరమింపచేయాలని కోరారు.
అన్ని డిపోలలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని తొలగించి కార్మికులకు ప్రశాంత వాతావరణం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే కార్మికవర్గమంతా క్షణికావేశానికి లో ను కాకుండా, ఎలాంటి అఘాయిత్యాలు చేసుకోవద్దని, ధైర్యంగా ఉండాలని, ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కావని, ఐక మత్యంతో మనమంతా కొట్లాడి మన డి మాండ్లను సాధించుకోవడానికి జేఏసీ కృత నిశ్చయంతో ఉందని తెలిపారు.
కార్మికులంతా జేఏసీ పట్ల విశ్వాసంతో ఉండాలని కోరారు. ఇదిలా ఉంటే జేఏసీ నేతలు అత్యవసరంగా సమావేశమై ఉద్యమ కార్యాచరణ ను ప్రకటించారు. శుక్రవారం నుంచి ఈనెల 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా డిపోల వద్ద నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు.
ఉద్యమ కార్యాచరణ...
- ఏప్రిల్ 24న డిపోల వద్ద మౌన ప్రదర్శనలు
-25న అన్ని డిపోల వద్ద వంటావార్పు
-26న అన్ని రీజియన్‌లలో,
జిల్లాలలో కార్మిక కవాత్.
-27న మంత్రులకు వినతిపత్రాలు
-28న మహిళ ఉద్యోగులతో అన్ని డిపో ల్లో బతుకమ్మలతో నిరసన ప్రదర్శనలు.
-29న అన్ని డిపోల ముందు అర్ధనగ్న ప్రదర్శనలు
- అన్ని డిపోలకు చెందిన జేఏసీ నాయకులు ఈ ఉద్యమ కార్యాచరణను అమలు చేయాలని పిలుపునిచ్చారు.






