బీజేపీ మహిళల ఆగ్రహ యాత్ర
భారీగా తరలిన గాంధీనగర్ డివిజన్ మహిళలు
ముషీరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు అధ్యక్షతన బీజేపీ మహిళా మోర్చ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా అగ్రహ యాత్ర ర్యాలీలో మహిళలు భారీఎత్తున పాల్గొన్నారు.
ట్యాంక్ బండ్ వద్ద జీహెచ్ ఎంసీ ఆఫీస్ నుంచి ఇందిరా పార్క్ వరకు నిర్వహించిన ఈ యాత్ర కు గాంధీనగర్ డివిజన్ నుండి మహిళలు, డివిజన్ మహిళా మోర్చ నాయకులు భారీగా తరలి వెళ్ళారు. గాంధీనగర్ డివిజన్‌లో ప్రారంభమైన ర్యాలీ ని ముఖ్య అతిథిగా బీజేపీ సికిం ద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శ్రీకాంత్, ఆనంద్ రావు, సాయి కుమార్, సత్యేంధర్, నీరజ్, జ్ఞానేశ్వర్, శేషుకాంత్, సంయుక్త రాణి, లక్ష్మి, డివిజన్ మహిళలు పాల్గొన్నారు.






