పారిశుద్ధ్య మహిళ కార్మికులకు సన్మానం
07-03-2026 06:14 PM
కేసముద్రం,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీ పారిశుద్ధ్య మహిళ కార్మికులను మున్సిపల్ చైర్ పర్సన్ బానోతు సునీత, వైస్ చైర్పర్సన్ డాక్టర్ అల్లం రమ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలులో భాగంగా శనివారం పట్టణంలో నిర్వహించిన వివిధ కార్యక్రమాలతో పాటు మున్సిపాలిటీ కార్యాలయంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళ పారిశుద్ధ్య కార్మికులను కొత్త దుస్తులు అందజేసి, శాలువాలతో సత్కరించారు.




