24 April, 2026 | 11:43 AM

Breaking News

సివిల్ ఇంజినీర్స్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం   •   రోడ్లపైకి ఆర్టీసీ కార్మికులు..!   •   అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం   •   చర్చలు ప్రారంభం.. హామీలు అమలు చేయాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్   •   ఆవేశంలో అఘాయిత్యాలకు పాల్పడవద్దు.. ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి   •   సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదు: RTC డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల మహేష్ గౌడ్ దిగ్భ్రాంతి   •   ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల సీఎం రేవంత్ దిగ్భ్రాంతి   •   అటెండర్ గా పనిచేసిన చోటే ప్రజా ప్రతినిధిగా సన్మానం   •   పాలేరులో ప్రజల ముంగిటకే 'ప్రజా దర్బార్'   •   మంథనిలో విషాదం.. వడదెబ్బతో సీనియర్ ఫోటోగ్రాఫర్ మృతి   •  

అటెండర్ గా పనిచేసిన చోటే ప్రజా ప్రతినిధిగా సన్మానం

24-04-2026 10:16 AM

ఖానాపూర్,(విజయక్రాంతి): ఖానాపూర్ మున్సిపాలిటీ(Khanapur Municipality) ఇందిరానగర్ కాలనీలో అప్పట్లోస్థానిక ప్రభుత్వ పాఠశాలలో అటెండర్ గా పనిచేసిన మేసు పోషమ్మ ఇప్పుడు ప్రజా ప్రతినిధిగా  ఖానాపూర్ మున్సిపాలిటీలో ఐదవ వార్డ్ కౌన్సిలర్ గా గెలుపొంది అదే పాఠశాలలో ఉపాధ్యాయుల చేత సన్మానం పొందుకుంది. గురువారం ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో మేసు పోచమ్మను ఆ పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడి పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా పోచమ్మ మాట్లాడుతూ గతంలో ఇదే పాఠశాలలో అటెండర్ గా పని చేసానని అదే చోట తనకు ఐదవ వార్డు కౌన్సిలర్ గా సన్మానం జరగడం సంతోషంగా ఉందని పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు షరిఫా, ఉపాధ్యాయులు శోభ, అంగన్వాడి ఉపాధ్యాయురాలు పుష్ప, సిబ్బంది గంగవ్వ, భట్టి లక్ష్మి ,కొంపల్లి లక్ష్మి, నేత నర్సమ్మ ,నాయకులు మేష సతీష్, ద్యావతి దామోదర్, కొంపల్లి రాజేందర్, తదితరులు పాల్గొన్నారు