ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
హైదరాబాద్: ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్(RTC Driver Shankar Goud) బలవన్మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ధైర్యం, మనోబలం కలగాలని ప్రార్థించారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబాన్ని దుఃఖ సాగరంలో ముంచిందని తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని, వారి సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ మూడ్రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా సమ్మెలో(Telangana RTC strike) పాల్గొని ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తూ వరంగల్ జిల్లా నర్సంపేటలో శంకర్ గౌడ్ నిన్న పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీంతో ఆయన సమీప ఆస్పత్రికి తరలించారు.






