తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్
బసవతారకం ట్రస్ట్‌బోర్డు సభ్యుడు జెఎస్‌ఆర్ ప్రసాద్
బంజారాహిల్స్, మే 9(విజయక్రాంతి): బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాం ట్ (బీఎంటీ) చికిత్సలు అందించామని సంస్థ ట్రస్ట్ బోర్డు సభ్యుడు జెఎస్‌ఆర్ ప్రసాద్ అన్నారు. హాస్పిటల్ నర్సింగ్ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక సదస్సును శనివారం నిర్వహిం చారు. బోన్‌మ్యారోట్రాన్స్ ప్లాంట్ నర్సింగ్ -విజ్ఞానం, ఆచరణ అనే అంశంపై నర్సింగ్ నిపు ణుల కోసం సదస్సును నిర్వహించారు.
ముఖ్య ఆహ్వానితులుగా హాజరైన జెఎస్‌ఆర్ ప్రసాద్ మాట్లాడుతూ 200ల మంది చిన్నపిల్లల కేసులతో సహా 700 ఎముక మజ్జ మార్పిడులు విజయవంతంగా నిర్వహించామన్నారు. తద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలోనే అత్యధిక సం ఖ్యలో బీఎంటీ చికిత్సలు అందించిన కేంద్రంగా నిలిచిన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఘనత సాధించిందని వెల్లడించా రు. ఈ ఘనత సాధించడంలో కీలక పాత్ర పోషించిన హెమటో- ఆంకాలజీ, పీడియాట్రిక్ ఆంకాలజీ బృందాలను ప్రశంసించారు.
బీఎం టీ వంటి అత్యంత సున్నితమైన చికిత్సలో ప్రాణాలను నిలబెట్టడంలో నర్సింగ్ సిబ్బంది చూపిన ధైర్యం, ఖచ్చితత్వం, మానవత్వాన్ని గుర్తిస్తూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం నర్సింగ్ సూపరింటిండెంట్ కందుల శ్రీవాణి, అకాడమిక్స్ అసో సియేట్ డైరెక్టర్ డాక్టర్ కల్పనా రఘునాథ్, మెడికల్ అంకాలజీ విభాగం డాక్టర్ సెంథిల్ రాజప్ప మాట్లాడుతూ నర్సింగ్ విభాగంలో ఉన్న నర్సులందరికీ, ముఖ్యంగా ఆంకాలజీ నర్సింగ్‌లో పని చేస్తున్న నర్సులు నిరంతరం కొత్త విషయాలను నేర్చుకొంటూ విషయ పరిజ్ఞానాన్ని ఎప్పటికపుడు సానపెట్టుకోవాలన్నారు.
బీఎంటీ సంరక్షణలో నాయకత్వం, ఆధార సహిత ఆచరణను స్వీకరించేలా నర్సులు ఉండాలని సూచించారు. కార్యక్రమానికి హాజరైన నర్సింగ్ విభాగపు ప్రతినిధులు మాట్లాడు తూ నర్సింగ్ కాన్ఫరెన్స్‌ను ఆచరణాత్మకమైన కార్యక్రమంగా అభివర్ణించారు. ఈ కార్యక్రమం నర్సులకు నాయకత్వ నైపుణ్యాలు, సాక్ష్యాధారిత ప్రోటోకాల్స్, సంక్లిష్టమైన ఎముక మజ్జ మార్పిడి కేసులను నిర్వహించడంలో ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుందని తెలిపారు. ఈ సద స్సులో బసవతారకం మెడికల్ సూపరింటిండెంట్ డాక్టర్ ఫణికోటేశ్వర రావు, కేర్ నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ మీనా కుమారి, పీడియాట్రిక్ అంకాలజీ కన్సల్టెంట్ డాక్టర్ వీరేంద్ర పాటిల్, బీఎంటీ వైద్య నిపుణులు, తెలుగు రాష్ట్రాల్లోని వివిధ హాస్పిటల్స్‌లో పనిచేస్తున్న సుమారు 250 మంది నర్సులు పాల్గొన్నారు.






