10 May, 2026 | 1:10 AM

యశోదకు అరుదైన గౌరవం

10-05-2026 12:26 AM

యశోద హాస్పిటల్స్ గ్రూప్- హైదరాబాద్.. ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ న్యూస్ వీక్ అండ్ స్టాటిస్టా ఆధ్వర్యంలో ప్రకటించిన వరల్డ్స్ బెస్ట్ హాస్పిటల్స్ ర్యాంకింగ్స్ జాబితాలో ప్రముఖ స్థానం సంపాదించి, భారతదేశంలోని అత్యుత్తమ ఆసుపత్రులలో ఒకటిగా ప్రతిష్ఠాత్మక గౌరవాన్ని అందుకుంది. ఈ ప్రతిష్ఠాత్మక గుర్తింపును యశోద హాస్పిటల్స్ గ్రూప్ వరుసగా 8వ సంవత్సరం కూడా సాధించడం ద్వారా ఆరోగ్య రంగ సేవలలో తమ నిబద్ధత, నాణ్యతా ప్రమాణాలు, విశ్వసనీయతను మరోసారి నిరూపించింది. 

2026 సంవత్సరానికి సం బంధించి ప్రపంచవ్యాప్తంగా 2,780 ఆసుపత్రులను విశ్లేషిం చి ఈ ర్యాంకింగ్స్ రూపొందించబడ్డాయి. ఇందులో వైద్య సేవల నాణ్యత, రోగుల అనుభవం, ఆధునిక వైద్య సాంకేతికత, క్లినికల్ ప్రతిభ వంటి కీలక అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక జాబితాలో యశోద హాస్పిటల్స్ గ్రూప్ ప్రముఖ స్థానం పొందడం, భారతీయ, తెలుగు రాష్ట్రాల  వైద్య రంగంలో యశోద హాస్పిటల్స్ గ్రూప్ సాధించిన ప్రపంచస్థాయి విశిష్టతను, గౌరవాన్ని ప్రతిబిబించింది.

ప్రత్యేకంగా వరల్డ్స్ బెస్ట్ హాస్పిటల్స్ 2026 జాబి తాలో తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం 7 ఆసుపత్రులు మాత్రమే చోటు దక్కించుకోగా, అం దులో యశోద హాస్పిటల్స్ గ్రూప్‌నకు చెందిన సోమాజిగూడ, సికింద్రాబాద్, మలక్‌పేట్ ఆసుపత్రులు, భారతదేశంలోని టాప్ 100 అత్యుత్తమ ఆసుపత్రులు, ప్రపంచ ది బెస్ట్, అత్యుత్తమ ఆసుపత్రుల జాబితాలో ప్రముఖ స్థానం సంపాదించడం  విశేషం. 

ప్రపంచస్థాయి ఆరోగ్య సేవలు

యశోద హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ గోరుకంటి రవీందర్‌రావు మాట్లాడుతూ.. ఈ వర ల్డ్స్ బెస్ట్ హాస్పిటల్స్ 2026 గుర్తింపు ద్వారా యశోద హాస్పిటల్స్ ప్రపంచస్థాయి ఆరోగ్య సేవలను అందించే విశ్వసనీయ భారతీయ ఆరోగ్యసంస్థగా మరోసారి నిలిచిందన్నారు. ఈ గుర్తింపు మా నిరంతర కృషికి, ప్రపంచ స్థాయి వైద్య సేవలను భారత దేశ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే మా అంకితభావానికి నిదర్శనంగా నిలిచిం దన్నారు.

వరుసగా 8వ సంవత్సరం ఈ అత్యున్నత గౌరవం దక్కడం మా వైద్య బృందం, సిబ్బంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రల ప్రజలందరికి ఎంతో గర్వకారణమన్నారు.  ఆధునిక సాంకేతికత, అత్యుత్తమ వైద్య  నిపుణుల వైద్య సేవలు మరి యు మానవతా దృక్పథంతో రోగుల ఆరోగ్య ఫలితాలను మరింత మెరుగుపరచేందుకు మేము నిరంతరం కృషి చేస్తూనే ఉంటామన్నారు. యశోద హాస్పిటల్స్ గ్రూప్ ఎల్లప్పు డూ అత్యుత్తమ ప్రపంచ స్థాయి వైద్య సేవలు ప్రజలకు అందించడంపై ఎప్పటికీ ధృష్టి పెట్టిందన్నారు. మా వైద్యులు, సిబ్బంది అంకితభావం మరియు కోట్లాది రోగుల అపార విశ్వాసం వల్లే ఈ విజయాన్ని సాధించగలి గాం, అని యశోద హాస్పిటల్స్ చైర్మన్ శ్రీ గోరుకంటి రవీందర్ రావు తెలిపారు.