6 May, 2026 | 4:06 AM

ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు

06-05-2026 02:46 AM

గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త కిరణ్

తుంగతుర్తి, మే 5: ఆయిల్ ఫామ్ సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త అరిగెల కిరణ్ అన్నారు. మంగళవారం  మండల కేంద్రంలోని డీఆర్ ఫంక్షన్ హాల్ లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణంపై అవగాహన కల్పించారు. రైతుల ఆర్థికాభివృద్ధికి ఆయిల్ఫామ్ సాగు ఎంతగానో దోహదప డుతుందన్నారు. ఆయిల్ ఫామ్ సాగుతో నీటిని ఆదా చేయడంతోపాటు అంతర పంటల సాగు ద్వారా మరింత ఆదాయం వస్తుందన్నారు.

రైతుల తప్పనిసరిగా పంట మార్పిడి విధానాన్ని పాటించాలన్నారు. ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగు కోసం సబ్సిడీతో పాటు ప్రోత్సాహం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ సైదులు, ఏడీఏ రమేష్, ఆర్టికల్చర్ ఆఫీసర్ ప్రమిద, ఏవోలు గణేష్, అమీషాబేగం, బాలకృష్ణ, నాగేశ్వరరావు, రైతులు పాల్గొన్నారు.