6 May, 2026 | 4:00 AM

సీపీఎస్ ఉద్యోగులంతా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి

06-05-2026 02:44 AM

పాత పెన్షన్ విధానం అమలు చేయాలి

సీపీఎస్ ఉద్యమ సన్నాహక సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ

నల్లగొండ టౌన్, మే 5: పాత పెన్షన్ విధానాన్ని అమలుపరిచేంతవరకు సి పీ ఎస్ ఉద్యోగులoత ఐక్య పోరాటాలు నిర్వహించాలని రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు స్థిత ప్రజ్ఞ, కల్వల్ శ్రీకాంత్ లు అన్నారు తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ (టీఎస్సీపీఎస్‌ఈయూ) ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక రెవిన్యూ భవన్లో నిర్వహించిన ‘సిపీఎస్ ఉద్యమ సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు.

సిపీఎస్ ఉద్యోగులు ఏకమై ఐక్యతతోనే అన్యాయమైన సిపీఎస్ విధానాన్ని రద్దు చేసేంతవరకు పోరాటాలు నిర్వహించాలన్నారు. ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధనలో రాజీ పడొద్దని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పని చేయాలన్నారు.

ఇప్పటికే రాజస్థాన్, చత్తిస్ ఘడ్, హిమాచల్ ప్రదేశ్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో సిపీఎస్ రద్దు చేసి ఒపీఎస్ ను అమలుచేస్తున్నాయన్నారు.మేనిఫెస్టోలో ప్రకటించినట్టు ప్రభుత్వం ఒపీఎస్ ను అమలుచేయాలని డిమాండ్ చేశారు. సిపీఎస్ అనేది ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా లేని విధానమని, ఇతర రాష్ట్రాల మాదిరిగా తెలంగాణలో కూడా పాత పెన్షన్ పునరుద్ధరించే వరకు పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అన్ని స్థాయిలో ఉద్యోగులంతా కలిసి ఉద్యమాన్ని ఉదృతo చేయాలన్నారు.

ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలోబలోపేతం చేసేందుకు గానుఏకగ్రీవంగా జిల్లా సిపీఎస్ అడ్ హాక్ కమిటీ‘ని ఎన్నుకున్నట్లు తెలిపారు. జిల్లా కమిటీ కన్వీనర్ గా పతంగి కరుణాకర్ గౌడ్ , కో. కన్వీనర్ లుగా ఎండి ఈధ్రిస్, ఎన్ యాదవ చారి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అన్ని గురుకులాల నుండి కె.మధు బాబు ,బాలస్వామి ఫరూక్ ,డా.విక్రమ్ రెడ్డి ,ఇఫ్తేకార్ ,ఎస్. రవికుమార్ ,సైదయ్య ,కృష్ణ లను వివిధ శాఖల నుండి  ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి విజయ్,రాష్ట్ర నాయకులు పున్న సోమనాథ్ వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.