4 August, 2026 | 1:29 AM

7న హ్యాండ్లూమ్ వాక్..

04-08-2026 12:27 AM

చార్మినార్ నుంచి చౌమహల్లా ప్యాలెస్ వరకు.. 

జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా నిర్వహిద్దాం: డాక్టర్ చిక్కా దేవదాసు

ముషీరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ నెల 7న చార్మినార్ నుంచి చౌమహల్లా ప్యాలెస్ వరకు హెరిటేజ్ హ్యాండ్లూమ్ వాక్ నిర్వహించనున్నట్లు చేనేత వర్గాల చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చిక్కా దేవదాసు తెలిపారు.

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ చేనేత దినోత్సవ పోస్టర్ను ఆవిష్కరించిన్నట్లు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ చిక్కా దేవదాసు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వం, చేనేత కార్మికులు సంయుక్తంగా చేనేత వారోత్సవాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు.

హెరిటేజ్ హ్యాండ్లూమ్ వాక్లో ప్రభుత్వ ఉన్నతాధికారులు, వివిధ రంగాల ప్రముఖులు, చేనేత కళాకారులు, చేనేత ప్రేమికులు, పౌర సమాజ ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. భారతీయ సాంప్రదాయంలో చేనేత రంగ విశిష్టతను, చేనేత కళాకారుల నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించి హాజరై భారతీయ చేనేత కళాకారులకు మద్దతు తెలపాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి సంఘం మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు బండారి లక్ష్మి, సెక్రటరీ కొండబత్తిని కృష్ణ, సంతోషి, వై.  శ్రీదేవి, అపర్ణ తదితరులు పాల్గొన్నారు.