13 March, 2026 | 1:22 PM

పరీక్షలకు ఏర్పాట్లు

13-03-2026 01:05 AM

కోదాడ, మార్చి 12 : కోదాడ పట్టణంలో ఈనెల 14 నుండి నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మండల విద్యాధికారి సలీం షరీఫ్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ పట్టణంలో 1485 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. 130 మంది సిబ్బందితో, 11 సెంటర్లలో 22 మంది చీఫ్ సూపర్డెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు విధులు నిర్వహిస్తారని తెలిపారు. ప్రతి సెంటర్ కి పోలీస్ బందోబస్తు ఉంటుందని, పరీక్ష కేంద్రాల్లో విద్యా ర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముఖ్యంగా తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు, అవసరమైన ఫర్నిచర్తో పాటు వైద్య సేవలను అందుబాటులో ఉంచుతున్నాం అన్నారు.