4 July, 2026 | 2:25 AM

కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం

04-07-2026 01:24 AM

రైతులకు ఊరట కలిగించిన వర్షం 

విత్తనాలు నాటిన రైతులకు ఆశలు 

కామారెడ్డి, జూలై 3 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో రైతులకు ఆశలు చిగురించాయి. ఈ సీజన్లో విత్తనాలు నాటిన రైతులకు సకాలంలో వర్షం కురియకపోవడంతో ఆందోళన చెందుతున్న రైతులకు ఈ భారీ వర్షం ఎంతో ఊరట నీచ్చింది. విత్తనాలను నాటిన రైతులకు ఈ వర్షం ఎంతో ఊపిరి పోసింది. నాటిన విత్తనాలు దండుగా అనుకుంటున్నా రైతులకు ఈ వర్షం భారీ ఊరట  కలిగించింది. కోట్ల రూపాయల వర్షం కురిసింది అంటూ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వేల రూపాయలు పెట్టి విత్తనాలను రైతులకు వర్ణుడు కరుణించకపోవడంతో ఆకాశం వైపు ఎదురుచూసిన రైతులకు సాయంత్రం కురిసిన భారీ వర్షం రైతులకు ఎంతో ఊరట ఇచ్చింది. విత్తనాలు నాటిన రైతులకు ఈ వర్షం ఎంతో ఊపిరి పోసింది.

నాట్న విత్తనాలు వృధా అవుతాయని ఆందోళన చెందుతున్న రైతులకు భారీ వర్షం కురవడంతో  నాటిన విత్తనాలకు ఇక  డోకా లేదని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, తాడువాయి, భిక్కనూరు దోమకొండ బీబీపేట పాల్వంచ మాచారెడ్డి రామారెడ్డి సదాశివ నగర్ లింగంపేట్ ఎల్లారెడ్డి నాగిరెడ్డిపేట్ నిజాంసాగర్ పెద్ద కోడపుగల్, జుక్కల్, మదనూర్, బిచ్కుంద, తదితర మండలాల్లో భారీ వర్షం కురవడంతో రైతులు ఉరట చెందారు. తాము నాటిన విత్తనాలకు వర్షం ఎంతో ఆదుకుందని రైతులు తెలిపారు. వర్షం లేక ఆందోళన చెందుతున్న రైతులకు  ఊరట కలిగించింది.