30 July, 2026 | 4:40 AM

దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి మహోత్సవం

30-07-2026 12:59 AM

హారైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు 

ఎల్బీనగర్, జులై 29: దక్షిణ షిరిడిగా ప్రసిద్ధి చెందిన  దిల్సుఖ్నగర్ లోని షిరిడి సాయిబాబా ఆలయంలో గురుపూర్ణిమ మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాయిబాబాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గురుపూర్ణిమ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితంలో ఆధ్యాత్మిక చై తన్యాన్ని పెంపొందించే పవిత్రమైన సందర్భమన్నారు. షిరిడి సాయిబాబా ఆశీస్సుల తో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు.

అలాగే, సాయిబాబా దేవాలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల మాజీ గవర్నర్ బం డారు దత్తాత్రేయ, బీజేపీ ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ సామ రంగారెడ్డి, గడ్డి అన్నారం డివిజన్ మాజీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి తదితరులు సాయిబాబాను దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.