30 July, 2026 | 3:48 AM

వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

30-07-2026 01:01 AM
  1. సమాజంలో మెరుగైన స్థితిగతులపై అవగాహన కల్పించాలి
  2. ఎంఈఓ వెంకటేశం

రాజేంద్రనగర్ జూలై 28 (విజయ క్రాంతి) : చదువులో వెనకబడిన విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారు విద్యలో రాణించే విధంగా విద్యా బో ధన చేయాలని అలాగే సమాజంలో మెరుగై న స్థితిగతులపై మంచి చెడుల పట్ల ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించా లని ఎంఈఓ వెంకటేశం ఉపాధ్యాయులకు  సూచించారు . బుధవారం  సెకండరీ గ్రేడ్ టీచర్లకు మూడు రోజులుగా  వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఇంటిగ్రేటెడ్ కోర్సులో భాగంగా టీచర్లకి రెండో విడతగా 50% జ డ్పీహెచ్‌ఎస్  హైదర్షాకోట్ స్కూల్ లో శిక్షణ ఇచ్చారు బుధవారం నిర్వహించిన ముగిం పు కార్యక్రమానికి ఎంఈఓ హాజరయ్యారు.

ఈ ఎంఈఓ వెంకటేశం  మాట్లాడుతూ ఈ కోర్సులో భాగంగా పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చదువు తో పాటు సొసైటీలో ఎలా బతకాలి అనే అంశం పై  విద్యార్థులకు కోఆర్డినేషన్ చేస్తూ పనిచేయాలి ఇక్కడ నేర్చుకున్న  ఇంప్లిమెంటేషన్ ప్రతి పాఠశాలలో ప్రతి విద్యార్థికి చేరే విధంగా ఉపాధ్యాయులు చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో  సునీల్ కుమార్,  కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయురాలు కవిత, అర్పిలుగా ఉపాధ్యా యులు కిరణ్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్, శ్రీనివాస్ ఎం ఐ ఎస్ రాఘవేందర్ సి అర్ పి సుదర్శన్ పాల్గొన్నారు