30 July, 2026 | 3:49 AM

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులతో ఆర్థిక భద్రత సాధించాలి

30-07-2026 12:59 AM

ఏఏంఎఫ్‌ఐ  సర్టిఫైడ్ అడ్వైజర్ శ్రీధర్

రాజేంద్ర నగర్ జూలై 29 (విజయక్రాం తి): రాష్ట్ర పోలీసు సిబ్బంది ఆర్థికంగా మరి ంత భద్రంగా ఎదగాలనే ఉద్దేశంతో తెలంగా ణ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ట్రైనీలకు బుధవారం సాయంత్రం రాణి రుద్రమదేవి ఆడిటోరియంలో మ్యూచువల్ ఫండ్స్పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమ సర్టిఫైడ్ అడ్వైజర్  డి. శ్రీధర్ ముఖ్య వక్తగా పాల్గొని, నేటి ఆధునిక ఆర్థిక వ్యవస్థలో మ్యూచువల్ ఫండ్స్ ద్వారా క్రమబద్ధమైన పెట్టుబడులు పెట్టడం వల్ల దీర్ఘకాలంలో మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చని వివరించారు. పెట్టుబడులను ప్రణాళికాబద్ధంగా, దీర్ఘకాల దృష్టితో కొనసాగిస్తే సంపదను పెంచుకునే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని తెలిపారు.

ముఖ్యంగా శిక్షణ పొందుతున్న యువ పోలీసు అధికారులు తమ ఉద్యోగ జీవిత ప్రారంభ దశలోనే క్రమం తప్పకుండా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు ప్రారంభిస్తే, భవిష్యత్తులో ఆర్థిక స్వావలంబనతో పాటు మంచి మూలధనాన్ని సమకూర్చుకునే అవకాశం ఉంటుందని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

సెషన్ సందర్భంగా ట్రైనీలు అడిగిన వివిధ సందేహాలకు డి. శ్రీధర్ సమగ్రంగా సమాధానాలు ఇచ్చి, పెట్టుబడులకు సంబంధించిన పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీస్ స్టైపెండరీ సబ్ ఇన్స్పెక్టర్లు, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. అలాగే అకాడమీ ఔట్డోర్ అధికారులు డీఎస్పీ తిరుపతి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఫణి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ నహర్ తదితరులు హాజరయ్యారు.