16 April, 2026 | 4:52 AM

భూగర్భ జలాలను సంరక్షించుకోవాలి

16-04-2026 01:44 AM

నారాయణపేట. ఏప్రిల్ 15,(విజయక్రాంతి) : జిల్లాలో భూగర్భ జలాలను సంరక్షించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో బుధవారం  భూగర్భ జల శాఖ ఆధ్వర్యంలో  కలెక్టర్ అధ్యక్షతన  భూగర్భ జలాల వినియోగం - సంరక్షణ పై జిల్లా అధికారుల సమన్వయ సమావేశం జరిగింది. సమావేశంలో  భూగర్భజలాల  భూగర్భ జలాల వివ రములు,భూగర్భ జలాల లభ్యత, వినియోగం మరియు వర్గీకరణ,  గ్రామీణ & పట్టణ ప్రాంతాలలో వర్షపు నీటి సేకరణ, నీటి సంరక్షణ నిర్మాణాలు- నిర్వహణ పై కలెక్టర్ చర్చించారు.

భూగర్భ జల వనరుల శాఖ ఏ డీ రవి మాట్లాడుతూ.. భూగర్భజలాల లభ్యత, వినియోగం, మండలాల వారీగా వర్గీకరణను, నీటి ప్రాముఖ్యతనుతెలియజేశారు. వ్యవసాయానికి భూగర్భజల వనరులపై ప్రధానంగా ఆధారపడటం తగ్గించు కోవాలని పరిమితంగా వినియోగించుకోవాలని కోరా రు. నీటిని సృష్టించలేం కానీ సంరక్షించుకోగలం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, ఇష్టారాజ్యంగా భూగర్భజలాల్నివెలికితీయడం కాకుండా వాన నీటిని సాధ్యమైనంత వరకు భూమిలో ఎక్కువగా లోపలి ఇంకింప చేసే విషయాలపై దృష్టి పెట్టాలని నీటి సంరక్షణ మనఅందరి సామాజిక బాధ్యత అన్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా నారాయణపేట జిల్లా క్రియా శీలక భూగర్భ జల వనరులు పుస్తకం విడుదల చేశారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు ఫణీంద్ర రెడ్డి, శ్రీను, సీపీవో ఖాఘవాహన్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్, జిఎం ఇండస్ట్రీస్ రామలింగేశ్వర గౌడ్, తదితరులు పాల్గొన్నారు.