తమ్ముడిపై అన్న న్యాయ పోరాట దీక్ష
దేవరకద్ర ( మూసాపేట), ఏప్రిల్ 15 : అన్నదమ్ములు ఆస్తుల కోసం ఎన్నో గొడవలు చూసాం. కాగా జిల్లాలోని మూసాపేట మండల పరిధిలోని పోల్కంపల్లి గ్రామంలో తమ్ముడు పై అన్న న్యాయ పోరాట నిమిత్తం నిరాహార దీక్ష చేశారు. పోల్కంపల్లి గ్రామ మాజీ సర్పంచ్ భర్త పంచవటి శ్రీకాంత్ రెడ్డి నా పట్టా భూమి సర్వేనెంబర్ 197 లో ఆక్రమించి మైనింగ్ చేయడానికి ,ప్రయత్నిస్తున్నారని, మంగళవారం నుండి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి గ్రామంలోని ఆంజనేయ స్వామి గుడిలో న్యాయం జరిగే వరకు నిరాహార దీక్ష అన్న రవికాంత్ రెడ్డి చేపట్టారు.
గ్రామస్తులు తోపాటు రవి కాంత్ రెడ్డి పలువురు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. గుంపులు గుట్ట సర్వేనెంబర్ 198 లో ప్రభుత్వ భూమి ఉందని , ఆ భూమిని మా సోదరుడు లీజుకు తీసుకొని రెవిన్యూ అధికారుల చేత తప్పుడు సర్వే చేసి హద్దులు గుర్తించారని బాధితుడు వాపోయాడు, ఈ భూమి కాకుండా గ్రామంలో ఉన్న ఒక ఎకరం నాలుగు గుంటల ఇంటి స్థలం గ్రామపంచాయతీకి దాన పూర్వకంగా ఇద్దామని నలుగురం అన్న అన్నదమ్ములం కలిసి సంతకాలు సంతకాలు చేస్తే, 20 గుంటల భూమి మాత్రమే గ్రామపంచాయతీకి చెల్లించి మిగతా భూమి సొంతం చేసుకున్నారని రవికాంత్ రెడ్డి చెప్పారు.
ఈ భూమితో పాటు గ్రామంలో ఉన్న చేరికుంటలో మట్టి తవ్వి పాలమూరు ప్రాజెక్టుకు ఆదాయం పొందారని ఆయన ఆరోపించారు, సొంత పొలం ముందు ఉన్న దారిలో సబ్ కాంట్రాక్టర్ గా బ్రిడ్జి నిర్మాణం చేసి పొలానికి వెళ్లే దారి లేకుండా చేశారని, రవికాంత్ రెడ్డి ఆరోపించారు, సర్వేనెంబర్ 197లో మైనింగ్ బ్లాస్టింగ్ తీవ్రత వల్ల పంటలు పండకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ నిరసన దీక్ష విషయం బంధువుల వరకు చేరడంతో గ్రామ సర్పంచ్ వెంకటేశ్వరమ్మ కలిసి రవికాంత్ రెడ్డికి నచ్చచెప్పి దీక్షను విరమింప చేశారు.






