త్రికూటేశ్వరాలయంలో నేటి నుంచి మహా విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు
భీమదేవరపల్లి ,మార్చి 6( విజయ క్రాంతి): హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ముత్తారం గ్రామంలో కాకతీయు ల కాలం నాటి చారిత్రక శ్రీ త్రికూటేశ్వరాలయంలో ఆధ్యాత్మిక సం దడి నెలకొంది. వందల ఏళ్ల పా టు పూజలకు నోచుకోక, శిథిలావ స్థకు చేరుకున్న ఈ ఆలయం నేడు శ్రీ శ్రీ శ్రీ సిద్దేశ్వర మహారా జు గారి ఆదేశాలతో గ్రామ ప్రజల సహకారంతో పునరుజ్జీవం పోసుకుంటోంది. సుమారు 13వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ త్రికూటేశ్వరాలయంలో వైభవంగా విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి .8 మార్చ్ ఉదయం 6 గంటలకు శ్రీ శ్రీ సిద్దేశ్వర మహారాజు గారిచే బ్రహ్మముహూర్తాన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం.మూడు రోజుల పాటు ఆధ్యాత్మిక వేడుకలు ఆలయ కమిటీ , గ్రామ ప్రజల ఆధ్వర్యంలో మార్చి 06 (శుక్రవారం) నుండి మార్చి 08 (ఆదివారం) వరకు మూడు రోజుల పాటు ఈ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరగనున్నాయి. ఈ మహోత్సవంలో భాగంగా శ్రీ మహా మృత్యుంజాయేశ్వర స్వామి వారి జీర్ణోద్ధరణతో పాటు 19 నూతన విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు.
నూతన గణపతి, గౌరీదేవి, విష్ణుమూర్తి, ఆంజనేయస్వామి,నవగ్రహాలు, రెండు నందులు,శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి,శిఖర త్రికలశ మరియు ధ్వజస్తంభ ప్రాణ ప్రతిష్ఠ,108 జంటలతో మహా హోమం,ఈ ప్రతిష్ఠా మహోత్సవంలో భాగంగా 07 మార్చ్ 2026, శనివారం ఉదయం 11:30 గంటలకు 108 జంటలతో మహా హోమం నిర్వహించనున్నారు. ఈ మూడు రోజుల పాటు ఆలయానికి విచ్చేసే భక్తులందరికీ మహా అన్నప్రసాద వితరణ ఉంటుందని, కావున భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ చైర్మన్ ఏనుగు వెంకట సురేందర్ రెడ్డి మరియు కమిటీ సభ్యులు,ముత్తారం గ్రామ ప్రజలు కోరారు.




