ఘనంగా వారాల పోచమ్మ దేవాలయ వార్షికోత్సవం
మాజీ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్
ముషీరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): గాంధీనగర్ డివిజన్ పరిధిలోని టీఆర్టీలో ఉన్న వారాల పోచమ్మ తల్లి దేవాలయం వార్షికోత్సవం బుధవారం ఆలయ నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఈ అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దేవాలయ కమిటీ సభ్యులు మాజీ కార్పొరేటర్ను ఘనంగా ఆహ్వానించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్, డివిజన్ అధ్యక్షుడు వి. నవీన్ కుమార్, సీనియర్ నాయకులు రత్న సాయి చంద్, శ్రీకాంత్, బీఎంఎస్ శంకర్, రఘు యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు కనకరాజు యాదవ్, ఏసు రత్నం, రాములు తదితరులు పాల్గొన్నారు.






